ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

