బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రోద్బలంతోనే వామనరావు తండ్రి మాట్లాడాడని అన్నారు. వామనరావు కేసును సీబీఐకి అప్పగించిన శ్రీధర్ బాబు.. మంథని మధుకర్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. తనకు వచ్చిన 70 వేల ఓట్ల ఆదరణనను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.

