
మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇవాళ(శనివారం) మంత్రులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని తెలిపారు. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కొత్త టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను వివరించినట్లు వెల్లడించారు.