
పులివెందులలో పోలీసులు పచ్చ కండువా వేసుకొని తిరుగుతున్నారన్నారు. తనకు మంత్రి నారా లోకేశ్, బీటెక్ రవిల నుంచి ప్రమాదం ఉందనే విషయం కొంతమంది టీడీపి వర్గీయుల ద్వారానే సమాచారం అందిందన్నారు. తనకు ప్రాణహాని జరగబోతోంది సమాచారం ఉంది అని ఆరోపించారు. తనను రక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని అలా కాకుండా ఏదైనా జరిగితే.. దానికి బాధ్యులు మంత్రి లోకేష్.. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రమే నని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.