
డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. ‘పోలీసులు ఓ మంత్రి ఇంట్లోకి వెళ్ళారు. మంత్రి కూతురు.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారు. సిమెంట్ కంపెనీల
యజమానులను బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలి. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోంది. టికెట్‌లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారు’ అని మండిపడ్డారు.