
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం శివంపేట బ్రిడ్జి వద్ద యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఓ యువకుడు శివంపేట బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కారు ఆపాడు. అనంతరం కారులో నుంచి దిగి.. రెయిలింగ్‌పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నదిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని జోగిపేట ఇందిరా నగర్ కాలనీకి చెందిన లోకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం నుంచి క్లింకర అనే యూట్యూబ్ చానెల్‌ను లోకేశ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.