తిరుపతిలో చోటు చేసుకున్న విద్యార్థి సంఘాల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. SFI విద్యార్థి నాయకులు అక్బర్, వినోద్ కిడ్నాప్‌కు గురయ్యారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసులో A-2గా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, A-3గా మంచు విష్ణు, A-1గా మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) పీఆర్ఓ సతీశ్ పేర్లు చేర్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పీఆర్ఓ సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మరింత ఉత్కంఠ రేపింది.

