
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత బీసీ బాలికల హాస్టల్లో అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయకుంటే, అది నిజమని ప్రజలు భావించే అవకాశం ఉందని అన్నారు. తాను చేస్తున్న భోజనంలో నాణ్యత తగ్గిందని, తల వెంట్రుక కనిపించిందని తెలిపారు. దానిని తీసి పడేశానని చెప్పారు. అయితే దానికి రకరకాల కథలు అల్లుతున్నారని వైసీపీపై విమర్శించారు.