పసిడి, సిల్వర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గతవారం రోజులుగా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి.పసిడి ఒక్కరోజే 10 శాతం తగ్గింది. దీంతో ఒక్కరోజులోనే తులం బంగారం ధర దాదాపు 20 వేల రూపాయలు తగ్గింది. ధరలు పడిపోయిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,60,580కు దిగి రాగా,వెండి ధర ఏకంగా లక్ష రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 3,50,000కు పడిపోయింది.

