నాగర్ కర్నూల్ జిల్లాలో హైదరాబాద్-శ్రీశైలం రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. లింగాలగట్టు వద్ద కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడంతో శ్రీశైలం నుంచి ప్రయాణాలు నిలిపివేశారు. తుఫాన్ ధాటికి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఈ రోడ్డులోని కొంత భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

