యూఎన్(UNO)లో పాకిస్తాన్‌పై మరోసారి ధ్వజమెత్తారు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. జమ్మూకాశ్మీర్ భారత్‌లో ఎల్లప్పుడూ అంతర్భాగమేనని..విడదీయరాని బంధంగా ఉందని.. ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆ్రమించిన ప్రాంతాల్లో విరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని…దానిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ సైనిక ఆక్రమణ, అణిచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని హరీష్ కోరారు.

