
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్ ప్రకటించారు. తాము వారించినా వినకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారీఫ్తో పాటు అదనపు పెనాల్టీ కూడా విధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై కొత్త టారీఫ్, పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ వెల్లడించారు.