గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అన్మోల్ బిష్ణోయ్ స్వయానా తమ్ముడు. కాంగ్రెస్ మాజీ MLA బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులతో పాటు అనేక హై ప్రొఫైల్ కేసుల్లో నిందితుడైన అన్మోల్ను అమెరికా నుంచి భారత్‌కు రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా, చట్టపరమైన ప్రక్రియల్ని పూర్తి చేసిన తర్వాత అన్మోల్ బిష్ణోయ్‌ను భారత దర్యాప్తు సంస్థలకు అప్పగించనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ మెయిల్ ప్రకారం అతడిని దేశం నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది.

