రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లోకోయిల్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. దీంతో భారత్ రిఫైనరీలకు రష్యా చమురు మరింత భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు బ్యారెల్‌కు మూడు డాలర్ల తగ్గింపు మాత్రమే లభించేది. ఆమెరికా ఆంక్షల కారణంగా ఆ డిస్కౌంట్ ఏడు డాలర్లకు చేరింది. ఈ కొత్త డిస్కౌంట్ డిసెంబర్‌లో లోడ్ చేసి జనవరిలో భారత్‌కు చేరే చమురుకు వర్తిస్తుంది

