
పాకిస్థాన్ మరోసారి భారత్ విషయంలో తన వక్రబుద్ధిని చూపించింది. ఇస్లామాబాద్ లోని భారత దౌత్యవేత్తల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలకు నీరు, గ్యాస్ వార్త పత్రికలు వంటి నిత్యావసర వస్తువల
సరఫరాను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది