
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 జేషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేయడం తెలిసిందే. జేషే మహ్మద్ గ్రూపునకు చెందిన కీలక ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు దాడి చేసి నాశనం చేశాయి.