
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తన లాయర్ల ద్వారా సామాజిక మాధ్యమమైన X (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు పహల్గామ్ ఘటనను కూడా అదే దిశగా మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, యుద్ధోన్మాద రాజకీయాలకు ఆరితేరకూడదని అన్నారు.