
అమెరికాలో ఉన్న మన వాళ్లు.. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అక్కడకు వస్తుంటే ఫలానా వస్తువులు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడులు, బట్టలు, వంటివి తీసుకురావాల్సిందిగా కోరుతుంటారు. వ్యక్తిగతంగా వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక నుంచి అమెరికా అధికారులు నిఘా పెట్టనున్నారు. అలానే ఇలా తెప్పించుకునే వాటి మీద పన్ను వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా అధికారులు.