భారతీయ విలువల గురించి ఏమాత్రం భయపడకుండా మాట్లాడిన సంస్థ ఆర్యసమాజ్ అని, ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి దార్శనికుడని, మహిళల విముక్తి కోసం కృషి చేశారని కొనియాడారు. దిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవం కేవలం సమాజంలోని ఒక భాగానికి లేదా ఒక వర్గానికి సంబంధించిన సందర్భం కాదని, యావత్ దేశానికి చెందిన అంశమని ప్రధాని మోదీ చెప్పారు.

