
విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
గత పాలకులు ‘ట్రూ అప్’ ఛార్జీల రూపంలో ప్రజలపై భారాన్ని మోపారని, కానీ తాము ఆ భారాన్ని తగ్గిస్తూ విద్యుత్ ఛార్జీలను క్రమంగా తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది వినియోగదారులకు ఊరట కలిగించడమే కాకుండా పరిశ్రమలకు కూడా ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.