బంగాల్ రాజకీయాల్లో మరోసారి హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారీ ర్యాలీ మధ్య అలిపుర్ సర్వే భవన్‌కు చేరుకున్న ఆమె, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ నామినేషన్ సమర్పించారు. కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి ప్రారంభమైన రోడ్‌షోలో మమతా బెనర్జీ సుమారు 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.