మూగజీవాల రక్తాన్ని సేకరిస్తున్న బ్లడ్ మాఫియా వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాచిగూడలోని సిఎన్‌కె ఇంపోర్టు అండ్ ఎక్స్‌పోర్టు కంపెనీలో నగర పోలీసులతో కలిసి తనిఖీలను నిర్వహించింది. సుమారు వెయ్యి లీటర్ల మూగజీవాల రక్తానికి సంబంధించి నిల్వఉంచిన ప్యాకెట్లను సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హరియానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ మూగ జీవాల రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.

