బ్రిటన్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హరియాణాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ అనే 30 ఏళ్ల విద్యార్థి యూకేలో విద్యనభ్యసిస్తున్నాడు. నవంబర్ 25న కొందరు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఓర్సెస్టర్లోని బార్బోర్న్ సమీపంలో అతడిపై దాడి జరిగింది.ఈ ఘటనలో విజయ్ ఒంటిపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

