తెలంగాణ గడ్డ నుంచి వెళ్లి విదేశీ రాజకీయాల్లో సత్తా చాటుతున్న హనుమకొండ బిడ్డ హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో, క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఆమె నియమితులవ్వడం తెలుగువారందరికీ గర్వకారణం. స్థానిక నగరాల పాలనలో కీలకమైన డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో హేమ ఎల్లాప్రగడకు దక్కిన ఈ పదవి ఆమె రాజకీయ నైపుణ్యానికి నిదర్శనం. స్థానిక నగరాల్లో పాలన సాగించే డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ నేతను లీడర్ ఆఫ్ ది కౌన్సిల్‌గా పిలుస్తారు.

