బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని జనసేన తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. “బొలిశెట్టి సత్యనారాయణ తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంగీకరించారు. బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదు” అని జనసేన పేర్కొంది.

