పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పశ్చిమబెంగాల్‌ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వస్తే ఇళ్ల పైకి బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలందరినీ బయటకు గెంటేస్తారని ఓటర్లను హెచ్చరించారు.

