అత్యంత భారీ భద్రత నడుమ పశ్చిమ బెంగాల్లో తొలి విడతగా 152 అసెంబ్లీ స్థానాలకు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో 3.6 కోట్ల మందికిపైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీ పటిష్ఠ చర్యలు చేపట్టింది.

