సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు గట్టి సమాధానం ఇచ్చారు. తాజాగా ఆమెపై మార్ఫింగ్ ఫోటోలతో దాడి చేసిన వ్యక్తులపై చిన్మయి ఘాటుగా స్పందించి వీడియోను షేర్ చేశారు. చిన్మయి తన మార్ఫింగ్ చేసిన ఫోటోను, దాన్ని షేర్ చేసిన అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ, వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపారు. గత 8–10 వారాలుగా కొంతమంది డబ్బులు తీసుకుని తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు.

