
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లలో ఆసియా ఓసియాన గ్రూప్ -4 లోని 22 దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ప్రభుత్వ అధికారులు సంప్రదాయ రీతిలో జానపద, గిరిజన నృత్య కళాకారులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాంగణాన్ని కలియదిరిగి వారంతా అందమైన దృశ్యాలను సెల్పీ లు తీసుకున్నారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు వివరించారు.