బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెబల్స్‌పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్ చేసింది కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్, శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌కు షోకాజ్ నోటీసులు పంపింది. బీహార్‌లోని అర్రా మాజీ ఎంపీ అయిన ఆర్కే సింగ్ 2017లో మోదీ తొలి మంత్రివర్గంలో విద్యుత్ మంత్రిగా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన స్థానాన్ని కోల్పోయారు.

