
వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో ,రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) , హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ . సీట్ల కేటాయింపును ఎన్డీయే మిత్రపక్షాలు స్వాగతించాయని చెప్పారు.