
2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలనే అంశంపై, పలు కులాల పేర్ల మార్పుపై అభ్యంతరాలను 31లోగా సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులతో చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. 26 కులాలనుజాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణతోపాటు వినతులు, అభ్యంతరాలు స్వీకరించాలని కమిషన్ నిర్ణయించింది.