
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తరువాత పార్టీ తీసుకోవాల్సీన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.