రెండు నెలల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ కానుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్‌బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

