బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండటంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు (SIR) బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండేందుకు సాయం చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ‘SIR గేమ్’ పనిచేయదని ఆయన అన్నారు.

