విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరమైన మరియు అర్ధనగ్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారని AISF (ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) నాయకులు ఆరోపించారు. ఇటువంటి కంటెంట్ వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా, ‘ఎక్స్పోజింగ్’ కంటెంట్ చూసేందుకు సబ్స్క్రిప్షన్ పేరుతో ఆమె డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని AISF నేతలు డిమాండ్ చేశారు.

