
హైదరాబాద్‌లో బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటెల్‌లో మెగా అభిమానుల అత్యవసర సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానుల వారించారు చిరు. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే, తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు.