
బాలకష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణని మించిన సైకో మరొకరు లేరని.. పైగా ఆయనకే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి మెంటల్ బాలకృష్ణ జగన్‌ని సైకో అంటారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. అలానే గతంలో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు.