బడికి వెళ్లి బలపం పట్టాల్సిన పిల్లలు ఇటుక బట్టీలు, హోటళ్లు, కర్మాగారాల్లో కూలీలుగా, వీధుల్లో తిరుగుతూ యాచకులుగా మారుతున్నారు. పోలీసు శాఖ ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో బాల కార్మికులను గుర్తించడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తనిఖీలు నిర్వహిస్తారు. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అప్పగించడం, కౌన్సెలింగ్ నిర్వహించడం చేస్తుంటారు. ఇప్పటి వరకు రెండు డివిజన్లలో 453 బాల కార్మికులను గుర్తించి వారికి పనుల నుంచి విముక్తి కల్పించారు.

