
గృహ హింస, లైంగిక, లైంగిక వేధింపులు, సైబర్ క్రైమ్ బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా సమగం హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయి( బహిరంగ విచారణ)లో ఆమె పాల్గొని కేసులు పరిష్కరించారు. హైదరాబాద్ లో కమిషన్ మొదటగా ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుంచి 60 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మహిళల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కమిషన్ నేరుగా బాధితుల వద్దకే వస్తుందన్నారు.
- 0 Comments
- Hyderabad