
ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పంపించుకోవడంతో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. బాలుడితో కలిసి హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకుంది. అనంతరం బాలుడిని అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. సిసి కెమెరాల ఆధారంగా బాలుడి తల్లి, ప్రియుడ్ని పట్టుకున్నారు. భార్య ఇచ్చిన సమాచారం మేరకు భర్తను పిఎస్‌కు పోలీసులు పిలిచారు. ఆమె ప్రియుడితోనే వెళ్లిపోతానని చెప్పడంతో బాలుడిని తండ్రికి అప్పగించారు.