
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై ఐదు వారాల ప్రచార ఉద్యమం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. “రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో” పేరుతో క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు.