
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని… విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.