పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) బుధవారం కొట్టివేసింది. రజత పతకం కోసం వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించినట్లు రెవ్‌స్పోర్ట్జ్ బుధవారం నివేదించింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రజత పతకం కోసం కాస్‌ను ఆశ్రయించిన ఫోగట్‌కు ఇటు భారతీయ క్రీడా అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది.