శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు చివరి మ్యాచ్ కూడా గెలిచి శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో ఛేదనకు శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

