పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది. ఇంతకూ అతడు ఎవరంటే.. బంగ్లాదేశ్ ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్. ఈ యంగ్‌స్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో.. సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు.

