ఖమ్మం జిల్లా రాపల్లి గ్రామానికి చెందిన గంగాదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసినప్పటి నుండి ఫలితాల విషయంలో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తాను ఫెయిల్ అవుతాననే భయంతో మనస్తాపం చెంది, గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితాల్లో అక్షంత్ పేరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను భయపడినట్లుగా ఫెయిల్ అవ్వడమే కాదు, ఏకంగా 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి ఉత్తీర్ణత సాధించాడు.

