పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలని, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని తాము ముందే చెప్పామన్నారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి అంటూ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

