ఛత్తీస్‌గఢ్ అధికార బీజేపీకి చెందిన ఒక కీలక నాయకుడు.. ఏకంగా తన ఫామ్‌హౌస్‌లోనే అక్రమంగా నల్లమందు సాగు చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దుర్గ్ జిల్లాకు చెందిన బీజేపీ నేత వినయ్ తామ్రకర్ లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో.. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ నిషేధిత పంటను సాగు చేస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించడంతో.. బీజేపీ అధిష్ఠానం సదరు నాయకుడిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది

