ప్రోకబడ్డీ 2025 టైటిల్‌ను దక్కించుకుంది దబాంగ్ ఢిల్లీ, శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై రెండు పాయింట్ల తేడాతో విక్టరీ సాధించి రెండోసారి ప్రోకబడ్డీ చాంపియన్ గా నిలిచింది.
నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 30-28 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్‌ను ఢిల్లీ ఓడించింది. టైటిల్‌ను నెగ్గేందుకు చివరి వరకు పోరాడి ఓడిన పుణేరి పల్టాన్ జట్టు రన్నరప్ గా నిలిచింది.

